సామాజిక విప్లవ యోధుడు జగ్జీవన్
కడప సెవెన్‌రోడ్స్: సామాజిక వివక్షతను జయించిన సామాజిక విప్లవ యోధుడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ అని, ఆయనకు దేశం యావత్తు నీరాజనాలు అర్పిస్తోందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కొనియాడారు. శనివారం కలెక్టరేట్‌లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ అనితా దీప్తి,జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడం, వివక్షతను నిర్మూలించడంలో ఆయన చేసిన కృషికి గుర్తుగా ఆయన జన్మదినాన్ని భారత ప్రభుత్వం ‘సమతా దివస్‘గా పరిగణించిందన్నారు. విలువలతో కూడిన ఆయన జీవితం మన అందరికీ ఆదర్శనీయమని, ఆయన అడుగు జాడల్లో నేటి యువత నడవాలని కోరారు. కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కలెక్టర్, అధికారులు,వివిధ సంఘాల నేతలతో కలసి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం జనార్దన్, పరిశ్రమల శాఖ జీఎం చాంద్ బాషా, ఎస్సీ,ఎస్టీ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు జేవీ రమణ, జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున, లోక్ జనశక్తి పార్టీ ప్రతాపరెడ్డి, మహాజన పార్టీ అధ్యక్షుడు సంగటి మనోహర్, దళిత మిత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె రామాంజులు తదితరులు పాల్గొన్నారు.
మహనీయుడు బాబూ జగజ్జీవన్ రామ్
కడప అర్బన్: దేశ స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘసంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ కొనియాడారు. శనివారం బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్పీ బి. రమణయ్య, ఏ.ఆర్ డి.ఎస్.పి కె.శ్రీనివాస రావు, ఆర్‌ఐలు ఆనంద్, వీరేష్, టైటాస్, శివరాముడు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
సామాజిక విప్లవ యోధుడు జగ్జీవన్


