నేడు జగ్జీవన్‌రామ్ జయంతి
కడప సెవెన్‌రోడ్స్: బాబు జగ్జీవన్‌రాం జయంతి వేడుకను శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీ నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
నేడు ఒంటిమిట్ట
బ్రహ్మోత్సవాలపై సమావేశం
కడప సెవెన్‌రోడ్స్: శ్రీరామ నవమి పర్వదిన సందర్బంగా ఒంటిమిట్టలో జరగనున్న బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై శనివారం మధ్యాహ్నం అక్కడి టీటీడీ భవనంలో అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు తిరుమల–తిరుపతి దేవస్థానం ఈఓ, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొంటారన్నారు. జిల్లాలోని ఇందుకు సంబంధించిన వివిధ శాఖల అధికారులు హాజరు కావాలని ఆయన కోరారు.
డీఈఓ వెబ్‌సైట్‌లో జాబితా
కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు యాజమాన్యాలలో పనిచేసే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు,తత్సమాన కేటగిరీల నుంచి పాఠశాల సహాయకులుగా పదోన్నతి కోసం సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ ఆధారంగా సబ్జెక్టుల వారీగా (www. kadapadeo.in) డీఈఓ వెబ్‌సైట్‌లో పొందు పరి చినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. సదరు సీనియారిటీ జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు పనిదినాల్లో సాయంత్రం 5 గంటలలోపు రాత పూర్వకంగా సరైన ఆధారాలతో డీఈఓ కార్యాలయంలో సంప్రదించాలని డీఈఓ పేర్కొన్నారు.
పరిసరాల శుభ్రతతో
వ్యాధులు దూరం
సిద్దవటం: పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులను దూరం చేయవచ్చని జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. సిద్దవటం మండలం లోని మాధవరం–1 గ్రామంలో శుక్రవారం జరుగుతున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, వృద్ధులు, బాలింతలు, చిన్నపిల్లలు బయట తిరుగొద్దని సూచించారు. ప్రస్తుతం జరిగే ఎన్‌సీడీ–సీడీ సర్వే, ఏబీబీఏ(అభా)జనరేషన్, ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పథకాలకు ఈ–కేవైసీ చేయించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. కార్యక్రమంలో మాధవరం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ శివకుమార్, సూపర్‌వైజర్లు నాగవల్లి, జ్యోతి ,రమణయ్య, ఏఎన్‌ఎంలు పద్మావతి, ఉమా, ఆశా వర్కర్‌లు సుజాత, అదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


