కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
● కడప నగరంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ సతీష్‌కుమార్‌రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి , కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి నరేన్ రామాంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
● పులివెందుల పట్టణంలోని భాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో పులివెందుల మున్సిపల్ ఇన్‌చార్జి మనోహర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ సతీష్‌కుమార్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ నాయకులు వరప్రసాద్, చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు.
● కమలాపురంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఉత్తమారెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, రాజుపాలెం సుబ్బా రెడ్డి,గంగాధర్‌రెడ్డి, జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి తదితరులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. చింతకొమ్మదిన్నె రింగురోడ్డు వద్ద నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి నరేన్ రామాంజులరెడ్డి పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
● ప్రొద్దుటూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పార్టీ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్‌పర్సన్ శారద, మున్సిపల్ చైర్మన్ బి. లక్ష్మిదేవి, వైస్ చైర్మన్లు ఆయిల్‌మిల్ ఖాజా, పి. బంగారు మునిరెడ్డి, ఆప్కాబ్ మాజీ ఛైర్‌పర్సన్ మల్లేల ఝాన్సీ, జిల్లా ఉపాధ్యక్షుడు పి. నరసింహారెడ్డి, ఎంపీపీ శేఖర్‌యాదవ్ పాల్గొన్నారు.
● బద్వేల్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. నియోజకవర్గ యువనాయకులు దేవసాని ఆదిత్య రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్‌రెడ్డి, కుడా మాజీ ఛైర్మెన్ గురుమోహన్, రమణారెడ్డి పాల్గొన్నారు.
● జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని యర్రగుంట్ల పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేశారు. అంతకుముందు వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ
ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం