హోంగార్డుల సేవలు అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

హోంగార్డుల సేవలు అభినందనీయం

Mar 12 2025 8:23 AM | Updated on Mar 12 2025 8:18 AM

కడప అర్బన్‌ : పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తూ అందరి మన్ననలు చూరగొంటున్న హోంగార్డుల సేవలు అభినందనీయమని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్‌ కుమార్‌ కొనియాడారు. జిల్లాలోని హోంగార్డ్స్‌ సిబ్బందికి వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు రెండు వారాలపాటు నిర్వహించిన మొబిలైజేషన్‌ కార్యక్రమం ముగింపు సందర్భంగా మంగళవారం డీ–మొబిలైజేషన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ హోంగార్డ్స్‌ పెరేడ్‌ (కవాతు)ను పరిశీలించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పెరేడ్‌ను ప్రతిభావంతంగా, క్రమశిక్షణతో చేశారని జిల్లా ఎస్పీ హోంగార్డులను అభినందించారు. ఆయన మాట్లాడుతూ శిక్షణా కాలం అనేది కీలకమని, విద్య నేర్చుకున్న అనంతరం సమాజానికి ఉపయోగపడకపోతే ఆ విద్యకు విలువ ఉండదన్నారు. అలాగే ఈ శిక్షణలో హోంగార్డులు నేర్చుకున్న అంశాలను దైనందిన విధుల్లో ప్రతిబింబించేలా చూడాలన్నారు. దేశ అంతర్గత భద్రతను పరిరక్షించడంలో హోంగార్డ్స్‌ సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. పోలీస్‌ శాఖతో పాటు అగ్నిమాపక, ఆర్‌.టి.ఓ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, జైళ్లశాఖ తదితర వాటిలో కీలకవిధులు నిర్వర్తిస్తూ ఆయా శాఖలకు వెన్నెముకగా నిలిచారని ఎస్పీ పేర్కొన్నారు. హోంగార్డుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలనీ, పరిశీలించి పరిష్కరిస్తాని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు. బ్యాండ్‌ పార్టీ ఏ.ఆర్‌. హెడ్‌కానిస్టేబుల్‌ పి.బాబు, బృందాన్ని పెరేడ్‌ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన హోంగార్డ్‌లకు బహుమతులు అందజేశారు. ఏ.ఆర్‌ అదనపు ఎస్పీ బి. రమణయ్య మాట్లాడుతూ రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా హోంగార్డ్స్‌ సిబ్బందికి మొబిలైజేషన్‌ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఈ.జీ. అశోక్‌కుమార్‌ ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్‌. డీఎస్పీ కె. శ్రీనివాసరావు, ఆర్‌ఐలు శ్రీశైలరెడ్డి, ఆనంద్‌, టైటస్‌, వీరేష్‌, శివరాముడు, ఆర్‌.ఎస్‌.ఐలు, పోలీస్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్‌, హోంగార్డుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

హోంగార్డుల డీ మొబిలైజేషన్‌ పెరేడ్‌

కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్‌కుమార్‌

హోంగార్డుల సేవలు అభినందనీయం 1
1/6

హోంగార్డుల సేవలు అభినందనీయం

హోంగార్డుల సేవలు అభినందనీయం 2
2/6

హోంగార్డుల సేవలు అభినందనీయం

హోంగార్డుల సేవలు అభినందనీయం 3
3/6

హోంగార్డుల సేవలు అభినందనీయం

హోంగార్డుల సేవలు అభినందనీయం 4
4/6

హోంగార్డుల సేవలు అభినందనీయం

హోంగార్డుల సేవలు అభినందనీయం 5
5/6

హోంగార్డుల సేవలు అభినందనీయం

హోంగార్డుల సేవలు అభినందనీయం 6
6/6

హోంగార్డుల సేవలు అభినందనీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement