బైక్‌, బొలేరో ఢీకొని యువకుడికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

బైక్‌, బొలేరో ఢీకొని యువకుడికి గాయాలు

Published Sat, Jun 15 2024 11:42 PM | Last Updated on Sat, Jun 15 2024 11:42 PM

బైక్‌, బొలేరో ఢీకొని యువకుడికి గాయాలు

సంబేపల్లె : చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై శనివారం బైక్‌, బొలేరో వాహనం ఢీకొని ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని గున్నికుంట్ల పంచాయతీ దళితవాడకు చెందిన యం.అరుణ్‌కుమార్‌ సొంత పనుల నిమిత్తం కలకడకు ద్విచక్ర వాహనంలో వెళ్తున్నాడు. మార్గంమధ్యలోని మొటుకువాండ్లపల్లె క్రాస్‌ సమీపంలో ఈ బైక్‌, అటు వైపు నుంచి వస్తున్న బొలేరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అరుణ్‌ని స్థానికుల సాయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement