
దీనంగా చూస్తున్న చిన్నారులు
సంబేపల్లె : చిత్తూరు – కర్నూలు జాతీయ రహదారిపై ఆదివారం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొన్న సంఘటనలో బి. ఆంజనేయులు (40) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు చిన్నమండెం మండలం, మల్లూరు ఎగువగడ్డ దళితవాడకు చెందిన బంగి ఆంజనేయులు తన కుటుంబ సభ్యులతో కలిసి సంబేపల్లె మండలంలోని శ్రీదేవరాయి నల్లగంగమ్మ ఆలయానికి వెళ్లి మొక్కు తీర్చుకున్నాడు. తిరిగి స్వగ్రామానికి భార్య, పిల్లలను ఆటోలో పంపించి ఆంజనేయులు ద్విచక్రవాహనంలో బయలుదేరాడు. మార్గమధ్యంలోని గంగిరెడ్డి చెరువు సమీపంలోకి రాగానే రాయచోటి వైపు నుంచి వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. దీంతో ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య అమరావతి, కుమారుడు యశ్వంత్, కుమార్తె దేవవర్షిణిలు తండ్రి మృతదేహం వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు.
వ్యక్తి దుర్మరణం

మృతి చెందిన ఆంజనేయులు