
పత్రాలు అందుతుకున్న ఐడీపీఎస్ స్కూల్ విద్యార్థులు
చాపాడు: విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో నిర్వహించిన 31వ జాతీయ బాలల విజ్ఞాన సమ్మేళనం–2023లో స్థానిక ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపికై నట్లు పాఠశాల చైర్మన్ వి.జయచంద్రారెడ్డి వెల్లడించారు. పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థులు ఎల్లూరి షేక్ మహమ్మద్ అయాన్, కుమారి నల్లగారి ఆరాధ్య ప్రదర్శించిన బ్లాక్ గొల్డ్ అనే ప్రాజెక్టును యూనివర్సిటీ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తల మనన్నలు పొందిందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే ప్రమాదకరమైన కార్బన్ డై మోనాకై ్సడ్‌ను సేకరించి జిరాక్స్‌కు ఉపయోగించే ఇంకు, పెయింట్లకు ఉపయోపడేలా చేయవచ్చని నిరూపించారు. ఇలాంటి ప్రయోగాల ద్వారా ఢిల్లీ లాంటి మహానగరాల్లో ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యల నుంచి బయటపడవచ్చని విద్యార్థులు సూచించారు.జాతీయస్థాయి ప్రాజక్టుల్లో తమ స్కూల్ ప్రాజెక్టు ఉండటం గర్వకారణమని పాఠశాల డైరెక్టర్ లోహిత్‌రెడ్డి తెలిపారు.