ట్రాన్స్‌జెండర్స్‌కు గుర్తింపు కార్డులు జారీ | Identity Cards to Transgenders | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌జెండర్స్‌కు గుర్తింపు కార్డులు జారీ

Mar 30 2023 1:12 AM | Updated on Mar 30 2023 12:30 PM

ధృవీకరణ పత్రాలతో ట్రాన్స్‌జెండర్స్‌  - Sakshi

ధృవీకరణ పత్రాలతో ట్రాన్స్‌జెండర్స్‌

సాక్షి ప్రతినిధి, కడప: జన్యుపరమైన లోపం వారి జీవితంలో చీకటి మిగిల్చింది. అయిన వాళ్లు కాదని, బయటి వాళ్లు ‘గే’ అని హేళన చేస్తుంటే ఏమి చేయాలో తోచని పరిస్థితి వారిది. అందరి చేత హిజ్రా అని పించుకున్న అటు ఇటు కాని వ్యక్తులు ఇప్పుడు ఆత్మ విశ్వాసంతో బతికే స్థాయికి ఎదుగుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకుసాగుతున్నారు. యాచన మీద బతికే స్థాయి నుంచి విద్య, స్వయం ఉపాధి దిశగా పయనిస్తున్నారు.

● సీఎం వైఎస్‌ జగన్‌ అన్ని వర్గాల సం‘క్షేమం’కోసం చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా హిజ్రా లు భిక్షాటన, సెక్స్‌వర్కర్‌గా జీవనం కొనసాగించకుండా ఉండటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా వైఎస్సార్‌ పింఛన్‌ కానుక కింద ప్రతినెలా రూ. 3000 పింఛన్‌ అందజేస్తున్నారు. మరోవైపు వి ద్య, ఉపాధి పట్ల చొరవ తీసుకుంటోంది. స్వయంశక్తి దిశగా ఎదిగేందుకు తోడ్పాటునిస్తూ ట్రాన్స్‌జెండర్స్‌ నియామకాలకు అవకాశం కల్పిస్తోంది.

అర్హులైన వారికి న్యాయం ..
నిబంధనల ప్రకారం హిజ్రాలు నిరుపేదలై తెల్లరేషన్‌కార్డు కలిగి ఉండాలి. ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి ట్రాన్స్‌జెండర్స్‌గా గుర్తింపు కలిగిన పత్రం పొందాలి. ట్రాన్సుజెండర్‌గా దరఖాస్తు చేసుకున్న వీరికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేస్తోంది. ముందుగా సచివాలయం లేదా ఇంటర్‌నెట్‌ సెంటర్‌లో దరఖాస్తు చేసుకుంటే ఆ వివరాలు సంబంధిత శాఖకు చేరుతాయి. వారి నుంచి ధ్రువీకరణ పొందితే ఆకార్డుపై కలెక్టర్‌ సంతకం చేసి ఐడెంటిటీ కార్డు జారీ చేస్తారు. గుర్తింపు కార్డు కావడంతో సంక్షేమ పథకాలకు అర్హత లభిస్తోంది. అలాంటి వారంతా వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద పింఛన్లు పొందేందుకు అర్హులు.

● సీఎం వైఎస్‌ జగన్‌ అర్హులకు ఎప్పటికప్పుడు కొత్త పెన్షన్లు మంజూరయ్యేలా చర్యలు చేపట్టారు. ప్రతి యేటా జనవరి, జులై నెలల్లో కొత్త పింఛన్లను మంజూరు చేస్తున్నారు. అర్హులైన వారు సచివాలయాల్లో పెన్షన్లకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అర్హులుగా గుర్తిస్తారు. గత టీడీపీ పాలనలో ట్రాన్స్‌జెండర్లకు మంజూరు చేసే పెన్షన్ల ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉండేది. అర్హులందరికీ పింఛన్లు దక్కేవి కాదు.

ఎప్పటికప్పుడు చర్యలు
అర్హులైన ట్రాన్స్‌జెండర్స్‌కు సక్రమంగా పెన్షన్లు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అలాగే అర్హులకు ఎప్పటికప్పుడు కొత్త పింఛన్లు మంజూరు కావడానికి నిబంధనలను సులభతరం చేశారు. అర్హులు సచివాలయాల్లో దర ఖాస్తు చేసుకోవాలి.
– కృష్ణకిశోర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌,జిల్లా విభిన్నప్రతిభావంతులు, హిజ్రాల సంక్షేమశాఖ, కడప

ఊరటగా ఉంది
ప్రభుత్వం రూ. 3000 పెన్షన్‌ను ప్రతినెలా 1వ తేదీనే అందజేస్తోంది. మాకెంతో ఊరటగా ఉంది. ప్రభుత్వం అన్ని వర్గాల మాదిరే మా సంక్షేమానికి కృషి చేయడం సంతోషదాయకం.

– అంబవరం సారిక, బిల్టప్‌, కడప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement