దాడికి యత్నించిన వ్యక్తుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

దాడికి యత్నించిన వ్యక్తుల అరెస్టు

Mar 30 2023 1:12 AM | Updated on Mar 30 2023 1:12 AM

రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న టిప్పర్‌ - Sakshi

రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న టిప్పర్‌

చింతకొమ్మదిన్నె : మండలంలోని మిట్ట సమీపంలో ఉన్న బావి దగ్గరికి ఈతకు వెళ్లిన చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన రోడ్డు కృష్ణాపురంలోని నవీన్‌రెడ్డి, శివకుమార్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌, శాంతి స్వరూప్‌, రాజశేఖర్‌లపై ఇనుప సుత్తి, కట్టెలతో విచక్షణా రహితంగా దాడి చేశారని సమాచారం రావడంతో సీకే దిన్నె ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లారు. ఈ విషయమై సీసీ కెమెరాల ద్వారా హత్యాయత్నానికి పాల్పడిన నిందితులు షేక్‌ మహమ్మద్‌ జునైద్‌, సయ్యద్‌ సొహైల్‌ అనే వారిని గుర్తించి అరెస్టు చేశారు. వారి వద్దనుంచి హత్యాయత్నానికి ఉపయోగించిన ఇనుపరాడ్లతోపాటు కట్టెలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారని ఎస్‌ఐ చెప్పారు.

టిప్పర్‌ బోల్తా

– ఇద్దరికి గాయాలు

అట్లూరు : మండల పరిధిలోని కడప–బద్వేలు ప్రధాన రహదారిపై బుధవారం టిప్పర్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు సిద్దవటం సమీపంలోని పెన్నానది నుంచి ఇసుక లోడ్‌తో వస్తున్న మినీ టిప్పర్‌ అట్లూరు మండలం యర్రబల్లి రోడ్డు సమీపానికి వచ్చే సమయానికి టైరు పగిలింది. దీంతో టిప్పర్‌ రోడ్డుకు అడ్డంగా బోల్తాపడింది. ఈఘటనలో డ్రైవర్‌కు స్వల్పంగా, రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సండ్రా వెంకటయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంకటయ్యను 108 వాహనంలో బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న టిప్పర్‌ను అధికారులు జేసీబీతో తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement