వలిగొండ : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధంపై ప్రధాని మోదీ మౌనం వీడి మధ్యవర్తిత్వం ద్వారా ఆపే ప్రయత్నం చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య అన్నారు. బుధవారం వలిగొండ మండలం నాగారంలో నిర్వహించిన సీపీఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అమెరికా అనుసరిస్తున్న సామ్రాజ్యవాద విధానం వల్ల ప్రపంచ శాంతికి విఘాతం కలుగుతోందన్నారు. ఈ యుద్ధం వల్ల వంట గ్యాస్ ,పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడి భారతదేశ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి. జహంగీర్, కల్లూరు మల్లేశం, కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు, దాసరి పాండు, జల్లెల పెంటయ్య, బూరుగు కృష్ణారెడ్డి, శ్రీనివాస చారి, సిర్పంగి స్వామి, మద్దెల రాజయ్య, తుర్కపల్లి సురేందర్, మెరుగు వెంకటేశం, కందడి సత్తిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


