డిప్యూటీ ఈఓగా నవీన్ కుమార్
యాదగిరిగుట్ట: యాదగిరీశుడి ఆలయ డిప్యూటీ ఈఓగా నవీన్ కుమార్‌ను నియమిస్తూ దేవాదా యశాఖ కమిషనర్ హనుమంతరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ డీఈఓ (డిప్యూటీ ఈఓ)గా విధులు నిర్వహిస్తున్న దోర్భాల భాస్కర్ శర్మను వేములవాడ శ్రీరాజరాజేశ్వరి దేవస్థానానికి డిప్యూటీ ఈఓగా బదిలీ చేశారు. ప్రస్తుతం నవీన్ కుమార్ ఏఈఓగా యాదగిరీశుడి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్నారు.
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి
మున్సిపాలిటీ స్వయం సమృద్ధి సాధించాలంటే ఆదాయ వనరులను పెంచుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. పట్టణంలోని బకాయి పన్నులను పూర్తిస్థాయిలో వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కౌన్సిల్‌లో మహిళా సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటం మహిళా సాధికారతకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
భువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపాలిటీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ. 55.73 కోట్ల బడ్జెట్‌కు పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ కౌన్సిల్ హాల్‌లో చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణిరవికుమార్ అధ్యక్షతన బడ్జెట్ ప్రత్యేక సమావేశం, అత్యవసర కౌన్సిల్ తొలి సమావేశం నిర్వహించారు. ఇన్‌చార్జి కమిషనర్ వై. కొండలరావు మున్సిపల్ 2026–27 సంవత్సరానికి సంబంధించిన ఆదాయ, వ్యయాల అంచనాలను సభ ముందు ఉంచారు. ప్రారంభ నిల్వ రూ. 24.87 కోట్లు, అంచనా ఆదాయం రూ. 56.03 కోట్లు మొత్తం నిల్వ రూ. 80.90 కోట్లు, ప్రతిపాదిత వ్యయం రూ. 55.73 కోట్లు, ముగింపు నిల్వ రూ. 25.17 కోట్లు ఉంటుందని వివరించారు. కౌన్సిల్ ఎజెండాలోని 11 అంశాలను సభ్యులు సుదీర్ఘంగా చర్చించి ఆమోదించారు.
సమష్టి కృషితోనే అభివృద్ధి:
ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి
ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టమని, కౌన్సిలర్లు రాజకీయాలకు అతీతంగా సమష్టి కృషితో పట్టణ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమి వ్వాలని సూచించారు.
కోతులు, కుక్కల బెడద నివారిస్తాం
పట్టణ ప్రజలను ఎంతో కాలంగా వేధిస్తున్న కుక్కలు, కోతుల సమస్య పరిష్కారానికి తగిన నిధులు కేటాయించి, శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని కలెక్టర్, అదనపు కలెక్టర్ భరోసా ఇచ్చారు.
అఖిపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేయాలి
వేసవిలో భువనగిరిలో తాగు నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని, ఇందుకోసం తక్షణమే అఖిల పక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేయాలని బీజేపీ, బీఆర్‌ఎస్, స్వతంత్ర కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఆదాయ వనరుల విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని కౌన్సిలర్లు తీవ్రంగా ఎండగట్టారు. ఆస్తి పన్ను లక్ష్యం రూ.9 కోట్లకు కేవలం రూ.5 కోట్లు మాత్రమే వసూలు చేయడంపై అధికారులను నిలదీశారు. ఈ కార్యక్రమంలో స్థానక సంస్థల అదనపు కలెక్టర్ ఎ. భాస్కర్ రావు, వైస్ చైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల, వివిధ వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.
2000 ఇళ్ల నంబర్లను తొలగించాలి:
కౌన్సిలర్ల వినతి
భువనగిరి పట్టణంలోని 22(ఏ) జీఓ జాబితాలో ఉన్న 2000కు పైగా ఇళ్ల నంబర్లను తక్షణమే తొలగించాలని కోరుతూ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్‌లకు స్థానిక కౌన్సిలర్లు వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో కౌన్సిలర్లు బర్రె పూజిత జహంగీర్, జాలిగం విఘ్నేష్, జంగిటి వినోద్, బొంతల నర్సింగరావు, పాశం అమర్నాథ్ ఉన్నారు.
ఫ ఆమోదించిన మున్సిపల్ కౌన్సిల్


