సమన్వయంతో జనగణన విధులు | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో జనగణన విధులు

Mar 31 2026 7:50 AM | Updated on Mar 31 2026 7:50 AM

సాక్షి, యాదాద్రి : జిల్లాలో జనగణన విధులను అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి పేర్కొన్నారు. డైరెక్టర్‌ ఆఫ్‌ సెన్సస్‌ భారతి హోలికేరి హైదరాబాద్‌ నుంచి జనగణన–2027పై అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌లో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. జనగణనలో భాగంగా మొదటి విడత ఇళ్ల గణన ప్రక్రియను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కర్‌ రావు, డీఆర్‌ఓ జయమ్మ, జిల్లా జనగణన అధికారి వెంకటరమణ, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్‌ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అర్జీలు పెండింగ్‌ లేకుండా చూడాలి

భువనగిరిటౌన్‌ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌ లేకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కర్‌ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డి తో కలిసి ప్రజల నుంచి 30 అర్జీలను స్వీకరించారు. అందులో రెవెన్యూ శాఖ 25, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించినవి 2, హౌసింగ్‌ 2, మున్సిపాలిటీకి సంబంధించినవి ఒక్కటి చొప్పున వచ్చినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జెడ్పీ సీఈఓ శోభారాణి ,జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్‌ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement