గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి

Mar 31 2026 7:08 AM | Updated on Mar 31 2026 7:08 AM

పెద్దవూర : గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతిచెందింది. ఈ ఘటన ఆదివారం రాత్రి పెద్దవూర మండలం ఉట్లపల్లి గ్రామంలో జరిగింది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం గేమ్యానాయక్‌ తండాకు చెందిన వడ్త్య తార(48) భర్తతో విడాకులు తీసుకుని అదే తండాలో తన తల్లి వద్ద ఉంటుంది. కొద్దిరోజులుగా ఉట్లపల్లి గ్రామానికి చెందిన బొజ్జ బుజ్జమ్మ ఇంటి వద్ద ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆదివారం ఉట్లపల్లిలో జరిగిన ఓ ఫంక్షన్‌కు వెళ్లిన తార మద్యం సేవించి గజ్జల లింగారెడ్డి ఇంటి సమీపంలో రోడ్డుపై నిద్రించింది. ఈ క్రమంలో రాత్రి గుర్తుతెలియని వాహనం రోడ్డుపై నిద్రించిన తారను ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు మంగులాల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వై. ప్రసాద్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement