114 సర్పంచ్, 993 వార్డు స్థానాలకు నేడు ఎన్నికలు
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 17 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సాక్షి,యాదాద్రి: మూడో విడత పంచాయతీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. బుధవారం ఆరు మండలాలైన చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల, మోటకొండూర్‌లో పోలింగ్ జరగనుంది. 1,59,289 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 79,364 మంది పురుషులు, 79,925 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగియగానే రెండు గంటల నుంచి ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటించనున్నారు. ఆ వెంటనే వార్డు సభ్యులు ఉపసర్పంచ్‌ను ఎన్నుకుంటారు.
119 గ్రామ పంచాయతీల్లో పోలింగ్..
ఆరు మండలాల పరిధిలో మొత్తం 124 గ్రామ పంచాయతీలు, 1086 వార్డులు ఉన్నాయి. నారాయణపురం, చౌటుప్పల్, మోటకొండూరు మండలాల్లో 10 గ్రామ పంచాయతీలు, 93 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఐదు గ్రామ పంచాయతీలు పాలకవర్గాలతో సహా ఏకగ్రీవం కాగా.. ఐదు గ్రామ పంచాయతీలు కేవలం సర్పంచ్‌లు మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. ఇక్కడ వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తంగా 114 సర్పంచ్ స్థానాలకు, 993 వార్డు స్థానాలకు ఎన్నిక జరగనుంది. ప్రతి వార్డుకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 1056 బ్యాలెట్ బాక్స్‌లను ఏర్పాటు చేశారు. మొత్తంగా 119 గ్రామ పంచాయతీలు, 993 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరుగుతున్న మండల కేంద్రాల్లో మంగళవారం ర్యాండమైజేషన్‌న్ ద్వారా పోలింగ్ సిబ్బందిని ఎంపిక చేసి ఆయా గ్రామ పంచాయతీలకు కేటాయించారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైన ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్స్‌లతో పోలింగ్ సిబ్బందిని పోలీస్ బందోబస్తు మధ్య మండల కేంద్రాల నుంచి గ్రామ పంచాయతీలకు ప్రత్యేక బస్సుల్లో పంపించారు
ఏకగ్రీవమైన సర్పంచ్‌లు వీరే..
మూడో విడత ఎన్నికల్లో పది గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలో రిక్కల మహేంద్‌రెడ్డి, ఎల్లంబావి గంజి వనజ, దామెర సాతిరిశ్రీధర్‌బాబు, నారాయణపురం మండలం రాచకొండ కాట్రోత్ కవిత, గంగమూల తండా కరెంటోతు లచ్చు, కడపగండి తండా కరెంటోతు రాము, వాచ్చాతండా వాంకుడోతు శోభా, పల్లగట్టు తండా రాజేందర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎన్నికలు జరుగుతున్న మండలాలు 06
గ్రామ పంచాయతీలు 119
పోలింగ్ సిబ్బంది 2467
పీఓలు 1056 ఓపీఓలు 1266
స్టేజ్– 2రిటర్నింగ్ అధికారులు 119
జోనల్ అధికారులు 26
బ్యాలెట్ బాక్స్‌లు 1056
సెన్సిటీవ్ పోలింగ్ కేంద్రాలు 45
హైపర్ సెన్సిటీవ్ పోలింగ్ కేంద్రాలు 09
బ్యాంకు ఎదుట ఖాతాదారుల ఆందోళన
మండలాల వారీగా ఓటర్లు ఇలా..
మండలం పురుషులు మహిళలు మొత్తం ఓటర్లు
అడ్డగూడూరు 11320 11702 23022
చౌటుప్పల్ 18800 19093 37893
గుండాల 13152 12917 26069
మోటకొండూరు 10397 10504 20901
మోత్కూరు 6528 6687 13215
నారాయణపురం 19,167 19,022 38189
మొత్తం 79364 79925 159289
ఫ ఉదయం 7 గంటల నుంచి ఒంటి గంట వరకు పోలింగ్
ఫ ఓటు హక్కు వినియోగించుకోనున్న 1,59,289 మంది ఓటర్లు
పోలింగ్ జరగనున్న పంచాయతీలు, అభ్యర్థులు ఇలా..
మండలం జీపీలు ఏకగ్రీవం ఎన్నికలు పోటీలో
జరిగేవి ఉన్నది
అడ్డగూడూరు 17 – 17 53
చౌటుప్పల్ 26 3 23 62
గుండాల 20 – 20 54
మోటకొండూరు 20 2 18 48
మోత్కూరు 10 – 10 39
నారాయణపురం 31 5 26 82
మొత్తం 124 10 114 338
114 సర్పంచ్, 993 వార్డు స్థానాలకు నేడు ఎన్నికలు
114 సర్పంచ్, 993 వార్డు స్థానాలకు నేడు ఎన్నికలు
114 సర్పంచ్, 993 వార్డు స్థానాలకు నేడు ఎన్నికలు
114 సర్పంచ్, 993 వార్డు స్థానాలకు నేడు ఎన్నికలు
114 సర్పంచ్, 993 వార్డు స్థానాలకు నేడు ఎన్నికలు


