పోలింగ్ సమర్థవంతంగా నిర్వహించాలి
మోటకొండూర్: పోలింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం మోటకొండూర్ మండల కేంద్రంలో ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పరిశీలించి పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓటర్లు రెండు బ్యాలెట్ పేపర్లను బ్యాలెట్ బాక్స్‌లో వేస్తున్నారా లేదా అని పరిశీలించాలన్నారు. అదేవిధంగా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సామగ్రీ డిస్ట్రిబ్యూషన్ పనులు పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగదివ్య, ఎంపీడీఓ ఇందిర, ఎంపీఓ చంద్రశేఖర్, ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
మోడల్ పోలింగ్ కేంద్రాల పరిశీలన
మోత్కూరు, గుండాల : మోత్కూరు మండలంలోని పాటిమట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాన్ని మంగళవారం రాత్రి కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. మామిడి తోరణాలు, గ్రీన్ నెట్‌తో ఏర్పాటు చేసిన అలంకరణను పరిశీలించారు. అనంతరం ఎన్నికల సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన వంటలను పరిశీలించారు. ఆయన వెంట భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీఓబాలాజి ఉన్నారు. అదేవిధంగా గుండాల మండలంలోని పాచిల్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. అతిథి గృహంలో గ్రీన్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎన్నికల ఇన్‌చార్జ్, అడిషనల్ పీడీ సురేష్, తహసీల్దార్ ఎస్.హరికృష్ణ, ఎంపీడీవో చండీరాణి ఉన్నారు.
ఓటును దుర్వినియోగం చేస్తే శిక్ష తప్పదు
భువనగిరిటౌన్ : ఓటును దుర్వినియోగం చేస్తే తెలంగాణ పంచాయతి రాజ్ చట్టంలోని రూల్ 227, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 135 ప్రకారం 5 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాలెట్ పేపర్‌ను చించడంగాని, బయటకు తీసుకువెళ్లడం లాంటి చర్యలకు పాల్పడితే శిక్షకు అర్హులు అవుతారని పేర్కొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు
పోలింగ్ సమర్థవంతంగా నిర్వహించాలి


