‘రీజినల్‌’ పనులకు అనుమతులివ్వాలి | - | Sakshi
Sakshi News home page

‘రీజినల్‌’ పనులకు అనుమతులివ్వాలి

Dec 17 2025 7:25 AM | Updated on Dec 17 2025 7:25 AM

‘రీజి

‘రీజినల్‌’ పనులకు అనుమతులివ్వాలి

సాక్షి, యాదాద్రి : హైదరాబాద్‌ చుట్టూ ప్రణాళికాపరమైన పట్టణాభివృద్ధికి ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ కారిడార్‌ అభివృద్ధి ఎంతో అవసరమని కేంద్ర ప్రభుత్వానికి వివరించినట్లు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో నిర్వహించిన హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ అఫైర్స్‌ మంత్రిత్వ శాఖ స్థాయి కమిటీ సమావేశంలో పలు అంశాలు చర్చించినట్లు పేర్కొన్నారు. ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న రీజినల్‌ రింగ్‌ రోడ్డు, రీజినల్‌ రింగ్‌ రైల్‌, మెట్రో ఫేజ్‌–2, వంటి కీలక ప్రాజెక్టులకు అనుమతులు ఇప్పించాలని కోరినట్లు చెప్పారు. వీటన్నింటికి అనుమతులు లభిస్తే ప్రాంతీయ అభివృద్ధి జరుగుతుందని వివరించినట్లు తెలిపారు.

ధాన్యం లారీలతో రైతుల ఆందోళన

రామన్నపేట: ధాన్యం కొనుగోలు చేసి 11 రోజులు గడుస్తున్నా.. మిల్లర్లు దిగుమతి చేసుకోకపోవడంతో ఇస్కిళ్ల గ్రామానికి చెందిన పలువురు రైతులు మంగళవారం రామన్నపేటలోని సుభాష్‌ సెంటర్‌లో ధాన్యం లారీని రోడ్డుకు అడ్డంగా పెట్టి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుమారు 1600బస్తాల ధాన్యాన్ని ఈ నెల 10న పీఏసీఎస్‌ వారు తూకం వేసి లారీల్లో లోడ్‌ చేసి ఇంద్రపాలనగరం శివారులోని రైస్‌ మిల్లుకు పంపారని, అయినా రెండురోజుల వరకు ధాన్యం దిగుమతి చేసుకోలేదన్నారు. క్వింటాకు 15 కిలోలు తగ్గించి దిగుమతి చేసుకుంటామని మిల్లు యజమాని చెప్పడంతో పీఏసీఎస్‌ అధికారులను ఆశ్రయించగా మరోమిల్లుకు లారీలను పంపించారని పేర్కొన్నారు. అక్కడా దిగుమతి చేసుకోకపోవడంతో ఆందోళనకు దిగినట్లు చెప్పారు. ట్రాఫిక్‌ స్తంభించడంతో ఎస్‌ఐ నాగరాజు అధికారులతో మాట్లాడి ధాన్యంను దిగుమతి అయ్యేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. లారీలను మిల్లుల వద్దకు పంపించారు.

క్షేత్రపాలకుడికి ఆకుపూజ

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న ఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజ నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో స్వామివారిని అభిషేకించారు. అనంతరం నాగవల్లి దళార్చన చేపట్టారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో వేకువజాముల సుప్రభాతం నిర్వహించి, సహస్ర నామార్చన జరిపించారు. ముఖ మండపంలో శ్రీస్వామి అమ్మవార్ల నిత్య కల్యాణ వేడుకను వైభవంగా నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవం, రాత్రి శయనోత్సవం నిర్వహించి, ఆలయాన్ని ద్వార బంధనం చేశారు.

కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వే చేపట్టాలి

భూదాన్‌పోచంపల్లి: మండల వ్యాప్తంగా ఈనెల 18 నుంచి 31 వరకు కుష్ఠువ్యాధి గుర్తింపు సర్వే చేపట్టాలని జిల్లా ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ వంశీకృష్ణ అన్నారు. జాతీయ కుష్ఠువ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మంగళవారం భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కుష్ఠువ్యాధి గుర్తింపు సమగ్ర సర్వేపై ఆశాకార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాధిగ్రస్తులను ఎలా గుర్తించాలనే దానిపై వివరించారు. మండల వైద్యాధికారిణి శ్రీవాణి, హెల్త్‌ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

‘రీజినల్‌’ పనులకు అనుమతులివ్వాలి1
1/1

‘రీజినల్‌’ పనులకు అనుమతులివ్వాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement