పడకలు లేక ప్రైవేట్‌కు..
ప్రస్తుతం ఎంత మంది బాధితులు వచ్చిన వారికి డయాలసిస్ సేవలు అందిస్తున్నాం. బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారికి కేటాయించిన సమయం ప్రకారం వచ్చినప్పుడు డయాలసిస్ చేస్తున్నాం.
–రాజ్‌కుమార్, డయాలసిస్
కేంద్రం ఇన్‌చార్జ్, భువనగిరి
భువనగిరి: జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాసిస్ కేంద్రానికి వచ్చే కిడ్నీ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా ఆ స్థాయికి అనుగుణంగా పడకలు లేకపోవడంతో కొంత మంది బాధితులు ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించాల్సి వస్తోంది.
ఒక్కొక్కరికి నాలుగు గంటల సమయం
2023లో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశారు. 5 పడకలతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రానికి ప్రారంభంలో 20 నుంచి 30 మందికి డయాలసిస్ సేవలు అందించారు. ఆ తర్వాత కేంద్రానికి వచ్చే బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో 2024 నవంబర్‌లో మరో మూడు పడకలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం డయాలసిస్ కేంద్రంలో హెచ్‌సీవీ రోగులకోసం ప్రత్యేకంగా ఒక పడకను ఏర్పాటు చేయగా మిగిలిన 7 పడకలను సాధారణ బాఽధితుల కోసం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 90 మంది బాధితులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఒక్కో బాధితునికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఏరియా ఆస్పత్రి నుంచి జీజీహెచ్ హోదా పెరిగినప్పటికీ ఆ స్థాయికి తగ్గ పడకలు లేకపోవడంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. చౌటుప్పల్, ఆలేరు సీహెచ్‌సీలో డయాలసిస్ సెంటర్లు ఉన్నప్పటికీ జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని డయాలసిస్ సెంటర్‌కు కిడ్నీ బాధితుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పెరుగుతున్న కిడ్ని బాధితులకు అనుగుణంగా పడకల సంఖ్య పెంచాలని బాధితులు కోరుతున్నారు.
ఫ జిల్లా కేంద్రాస్పత్రిలోని డయాలసిస్
కేంద్రానికి పెరిగిన రోగుల తాకిడి
ఫ పడకలు సరిపడా లేకపోవడంతో
ప్రైవేట్‌ను ఆశ్రయిస్తున్న రోగులు


