కేటీఆర్‌కు వినతి
తుర్కపల్లి: మండలంలోని వాసాలమర్రి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై సర్పంచ్ అభ్యర్థి పలుగుల ఉమారాణి నవీన్‌కుమార్, మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మంగళవారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు వినతిపత్రం అందజేశారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజల తీర్పును పక్కనపెట్టి ఫలితాలను మార్చే ప్రయత్నాలు జరిగాయని కేటీఆర్‌కు వివరించినట్లు తెలిపారు.
విచారణకు ఆదేశాలు
వాసాలమర్రి గ్రామంలో జరిగిన ఓటు మిస్సింగ్ ఘటనపై విచారణ చేపట్టాలని కలెక్టర్ హనుమంతరావు అదేశించారు. విచారణాధికారిగా ఆర్డీఓ కృష్ణారెడ్డిని నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓటు మిస్సింగ్‌పై సర్పంచ్ అభ్యర్థి పలుగుల ఉమారాణి ఫిర్యాదు నేపథ్యంలో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.


