ఓట్ల లెక్కింపు ఇలా..
బ్యాలెట్ బాక్స్‌లో నుంచి బ్యాలెట్ పేపర్లను బయటికి తీసి వాటిని వేరు వేస్తారు. ఆ తరువాత లెక్కిస్తారు.
- 8లో
పొరపాట్లకు
అవకాశం ఇవ్వొదు
యాదగిరిగుట్ట: పొరపాట్లకు తావివ్వకుండా పోలింగ్ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు సిబ్బందికి సూచించారు. యాదగిరిగుట్ట పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను ఆయన సందర్శించి పోలింగ్ సామగ్రి పంపిణీని పరిశీలించారు. పోలింగ్ నిర్వహణ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రానికి చేరుకున్న తరువాత ఫారం–9 ప్రకారంగా బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పేపర్లు, స్వస్తిక్ మార్క్ తదితర సామగ్రిని చెక్‌చేసుకోవాలని స్పష్టం చేశారు. ఓటరు బ్యాలెట్ బాక్స్‌లో రెండు బ్యాలెట్ పేపర్లు వేస్తున్నారా లేదా పరిశీలిస్తుండాలన్నారు. విధులకు గైర్హాజరైన సిబ్బందికి వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలింగ్ అధికారులు, సిబ్బందికి కలెక్టర్ స్వయంగా భోజనం వడ్డించారు.


