స్మార్ట్ ఫోన్‌కు అనుమతిలేదు
భువనగిరిటౌన్ : గ్రామ
పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రంలోకి స్మార్ట్ ఫోన్‌లను తీసుకెళ్లకూడదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌ను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లడంపై నిషేధం ఉంది. ఒకవేళ ఎవరైనా స్మార్ట్ ఫోన్ తీసుకొస్తే స్విచ్‌ఆఫ్ చేసి భద్రతా సిబ్బంది లేదా పోలింగ్ సిబ్బంది లేదా బీఎల్‌ఓ వద్ద ఉంచాలి. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ బూత్‌లోకి స్మార్ట్ ఫోన్‌తో పాటు కెమెరాలను కూడా అనుమతించరు.
దివ్యాంగుల ఓటింగ్ ఇలా..
భువనగిరి : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులకు సహాయం చేసేందుకు 18 ఏళ్లు నిండిన సహాయకుడిని ఎంపిక చేసుకోవచ్చని ఎన్నికల నిబంధనల్లో ఉంది. ఇదే విషయాన్ని పోలింగ్ కేంద్రంలోని రిటర్నింగ్ అధికారికి తెలిపితే ఆయన అనుమతి ఇస్తారు. దివ్యాంగులు సహాయకుడితో లోపలికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఎవరికి ఓటు వేశారనే విషయాన్ని సహాయకుడు గోప్యంగా ఉంచడంతో పాటు మరోమారు ఇతరులకు సహాయకుడిగా రానంటూ అతను డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా ఓటు వేసే వ్యక్తి ఎడమచేతి చూపుడు వేలికి సిరా గుర్తు వేస్తారు. సహాయకుడిగా వచ్చిన వ్యక్తికి మాత్రం కుడి చేతి చూపుడు వేలికి గుర్తు వేస్తారు.
స్మార్ట్ ఫోన్‌కు అనుమతిలేదు


