ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్మ
యాదగిరిగుట్ట రూరల్ : ఆస్పత్రి భవనంపై నుంచి దూకి యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామానికి చెందిన పప్పుల నరేందర్(37) ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పప్పుల నరేందర్ వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 1వ తేదీన భువనగిరి మండలం ముస్తాన్‌పల్లికి వెళ్లిన నరేందర్ అక్కడ పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతడిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నరేందర్ ఆదివారం ఉదయం ఆస్పత్రి మూడో అంతస్తులోని బాత్రూమ్ కిటికీ నుంచి కిందకు దూకాడు. ఈ మేరకు చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆర్థిక సమస్యలతోనే నరేందర్ పురుగుల మందు తాగాడని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కడుపునొప్పి భరించలేక ఆస్పత్రి భవనంపై నుంచి దూకినట్లు సమాచారం. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్
పోటీలకు ఎంపిక
సూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీవెంకటసాయి ఒకేషనల్ జూనియర్ కళాశాలకు చెందిన ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్) ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఆర్. గాయత్రి రాష్ట్రస్థాయి అండర్–19 బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు కళాశాల కరస్పాండెంట్ బాలగౌడ్, చైర్మన్ విజయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని అభినందించారు.
వ్యక్తి అదృశ్యం
నల్లగొండ : నల్లగొండ పట్టణంలోని బొట్టుగూడకి చెందిన పులిగిల్ల శంకర్ ఆదివారం నుంచి అదృశ్యమైనట్లు అతడి కుటుంబ సభ్యులు సోమవారం నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన శంకర్ తిరిగి రాలేదని పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 8712667670, 8712577232 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్మ
ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్మ


