భార్య సర్పంచ్‌గా.. భర్త వార్డుసభ్యుడిగా పోటీ
తుర్కపల్లి: మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో మన్నె రజిత కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉండగా.. ఆమె భర్త మన్నె తిరుపతిరెడ్డి 6వ వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్నాడు. ఇలా ఇద్దరూ పోటీ చేయడంపై గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
సర్పంచ్ బరిలో మాజీ సైనికుడు
డిండి : ఆర్మీలో 30 సంవత్సరాల పాటు విధులు నిర్వహించి ఎన్‌ఎస్‌జీ కమాండోగా పదవీ విరమణ పొందిన మాజీ సైనికుడు గ్రామానికి సేవ చేయాలనే లక్ష్యంతో ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. నల్లగొండ జిల్లా డిండి మండలం గోనబోయినపల్లి గ్రామానికి చెందిన వర్కాల బాలనారాయణ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గ్రామ సర్పంచ్ పదవికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. తనను గెలిపిస్తే ప్రజలకు సేవకుడిగా పని చేస్తానని, గోనబోయనపల్లి నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా సిద్దాపూర్ గ్రామం వరకు రోడ్డుతో పాటు చెక్‌డ్యాం నిర్మాణం పూర్తిచేయిస్తానని బాలనారాయణ చెప్పారు.
భార్య సర్పంచ్‌గా.. భర్త వార్డుసభ్యుడిగా పోటీ


