ఉదయం ఇటు.. సాయంత్రం అటు..
పెద్దవూర : పంచాయతీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం ఒక పార్టీలో ఉన్న నాయకులు, సాయంత్రం మరో పార్టీలో చేరుతున్నారు. పెద్దవూర మండలంలోని బట్టుగూడెం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు దండెం వెంకన్న, రుద్రాక్షి రాములుతో పాటు పలువురు శుక్రవారం ఉదయం కాంగ్రెస్‌లో చేరి పార్టీ కండువాలు కప్పుకున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు వారితో మాట్లాడి ఒప్పించి మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ వద్దకు తీసుకెళ్లారు. వారంతా తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరగా వారికి మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఉదయం ఇటు.. సాయంత్రం అటు..


