30 ఏళ్ల తర్వాత మళ్లీ బరిలో..
చిట్యాల : గతంలో సర్పంచ్‌గా 14 ఏళ్లు పని చేసిన నాయకుడు ఇప్పుడు రిజర్వేషన్ కలిసి రావడంతో 30 ఏళ్ల తర్వాత తిరిగి అదే గ్రామపంచాయతీకి సర్పంచ్‌గా పోటీ చేస్తున్నాడు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన బొంతల చంద్రారెడ్డి సీపీఎం మద్దతుతో 1981లో సర్పంచ్‌గా పోటీ చేసి విజయం సాధించారు. 1988లో రెండో సారి, 1994లో మూడోసారీ సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందారు. అయితే 14 ఏళ్లు సర్పంచ్‌గా పని చేసిన ఆయన పార్టీ బాధ్యతలు నిర్వహించేందుకు 1995లో రాజీనామా చేశారు. 2వేల సంవత్సరంలో భువనగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వెలిమినేడు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి జనరల్‌గా మారడంతో బొంతల చంద్రారెడ్డి మరో మారు సీపీఎం మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి గతంలో తాను సర్పంచ్‌గా 14 ఏళ్లపాటు పని చేసిన సందర్భంలో చేపట్టిన ఆభివృద్ధిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.


