మాలిలో బండసోమారం యువకుడి కిడ్నాప్
● ఆందోళనలో కుటుంబ సభ్యులు
భువనగిరి : ఉపాధి కోసం ఆఫ్రికా ఖండానికి వెళ్లిన భువనగిరి మండలానికి చెందిన యువకుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. బండసోమారం గ్రామానికి చెందిన నల్లమాస జంగయ్య, మహేశ్వరీల చిన్నకుమారుడు ప్రవీణ్ ఏడాది క్రితం హైదరాబాద్‌లోని బోర్‌వెల్ కంపెనీలో పనిలో చేరాడు. అక్కడి నుంచి కంపెనీ ద్వారా ఆఫ్రికా ఖండంలోని మాలి దేశానికి వెళ్లాడు. అక్కడే కోబ్రి సమీపంలో బోర్‌వెల్‌కు సంబంధించిన డ్రిల్లర్‌గా పనిచేస్తున్నాడు. గత నెల 23న పని ముగించుకుని వస్తుండగా జమాత్ నుస్రత్ అల్–ఇస్లామ్ వల్–ముస్లిమీన్ సంస్థకు చెందిన తీవ్రవాదులు అతడిని కిడ్నాప్ చేశారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఆలస్యంగా తెలి యడంతో ఆందోళన చెందు తున్నారు. మాలి దేశంలోని భారత రాయబార అధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. నిందితుల నుంచి తమ కుమారుడిని విడిపించి, ఇండియాకు తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.


