దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి
తిప్పర్తి : మండలంలోని ఎల్లమ్మగూడెం గ్రామంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేసిన వారిని కఠినంగా శిక్షించడంతోపాటు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని భర్తరఫ్ చేయాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం డిమాండ్ చేశారు. శుక్రవారం ఎల్లమ్మగూడెం గ్రామంలో మామిడి నాగలక్ష్మి, యాదగిరిలను మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి పరామర్శించారు. రాజారాం మాట్లాడుతూ.. కిడ్నాప్ ఘటనపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈనెల 10న హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌లో గల అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించనున్న ధర్నాకు పార్టీలు, సంఘాలకతీతంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ బడుగుల లింగయ్య మాట్లాడుతూ.. ఎల్లమ్మగూడెంలో జరిగిన ఘటన దారుణమన్నారు. బీసీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కార్యక్రమంలో దూదిమెట్ల బాలరాజు, కేయూడీఏ చైర్మన్ సుందర్‌రాజ్‌యాదవ్, గొర్లకాపర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సోమనబోయిన సుధాకర్, జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, జిల్లా యాదవ సంఘం మహిళా అధ్యక్షురాలు మామిడి నాగలక్ష్మి యాదవ్, ప్రజాఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు వాసుకే యాదవ్, యాదవ మహాసభ రాష్ట ప్రధాన కార్యదర్శి లొడంగి గోవర్ధన్ పాల్గొన్నారు.


