ఏఎస్‌డీతో బోగస్ ఓట్లకు చెక్
మిగిలిపోయిన స్లిప్‌ల ఆధారంగా ఏఎస్‌డీ లిస్ట్
షిఫ్టెడ్..
డెత్, డూప్లికేట్..
ఆబ్సెన్టీ ఓటర్లు అంటే..
సాక్షి, యాదాద్రి : దొంగ, బోగస్ ఓట్లు వేసేందుకు ఆస్కారం ఉండదిక. పోలింగ్ రోజు ప్రతి బూత్‌లో ప్రతి ప్రిసైడింగ్ అధికారి వద్ద ఏఎస్‌డీ (ఆబ్సెన్టీ, షిఫ్టెడ్, డెత్ లేదా డుప్లికేట్) జాబితా ఉంటుంది. దాని ద్వారా దొంగ ఓట్లు వేయడానికి వచ్చే వారిని సులభంగా పట్టేయొచ్చు. ఏఎస్‌డీ జాబితాను ఎన్నికల అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్ స్లిప్‌ల పంపిణీ చేసి మిగిలిన స్లిప్‌లను అబ్సెన్టీ, షిఫ్టెడ్, డెత్ లేదా డుప్లికేట్ ఓటర్లుగా నిర్ధారిస్తున్నారు. ఏఎస్‌డీ విధానం ద్వారా నిజమైన ఓటరు ఓటు వేయడానికి అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ సమయంలో చనిపోయిన ఓటరు పేరున మరొకరు ఓటు వేయడానికి వచ్చినా లేదా బతికుండగానే పొరపాటున డెత్ ఓటరుగా గుర్తించబడినా ఒకటికి రెండుసార్లు ఏఎస్‌డీ జాబితా పరిశీలించి అనుమతిస్తారు. అంతేకాకుండా ఒక వార్డులో ఓటువేసి చేతి వేలికి ఉన్న ఇంకుని చెరిపేసి మరొక వార్డులో వేయడానికి వీల్లేకుండా అడ్డుకుంటారు.
రెండు గుర్తింపు కార్డులు తీసుకెళ్తేనే అనుమతి..
ఏఎస్‌డీ జాబితాను పోలింగ్ రోజు ప్రిసైడింగ్ అధికారులకు అందజేస్తారు. ఏఎస్‌డీ జాబితాలో పేరున్న ఓటరు ఎన్నికల కమిషన్ నిర్దేశించి ఏవేని రెండు గుర్తింపు కార్డులు తీసుకెళ్తేనే ఓటు వేయడానికి అనుమతిస్తారు.
ఫ సిద్ధమవుతున్న జాబితా
ఫ పోలింగ్ రోజు ప్రతి కేంద్రంలో అందుబాటులోకి..
ఓటర్లకు పోలింగ్ స్లిప్‌లు పంపిణీ చేసేటప్పుడు ఎవరైనా ఓటర్లు లేనట్లయితే మిగిలిపోయిన స్లిప్‌లు మూడు రకాలు ఉంటాయి. చనిపోయిన, డబుల్ ఓటు, షిఫ్టెడ్ అయినవారి స్లిప్‌లు ఉంటాయి. వీటి ఆధారంగా ఏఎస్‌డీ జాబితా రెడీ చేస్తారు. ఈ జాబితాలో పేరున్న వారు ఓటు వేయడానికి వస్తే ఒకటికి రెండుదఫాలు విచారణ చేసి, రెండు గుర్తింపు కార్డులు ఉంటేనే ఓటు వేయడానికి అనుమతిస్తారు.
–విష్ణువర్ధన్‌రెడ్డి, డీపీఓ
ఒక కుటుంబంలోని ఓటర్లు వివిధ కారణాలతో ఇంట్లో ఉండకుండా పోతారు. ఓటు నమోదు చేసుకున్న తర్వాత బదిలీ, ఊరు మారడం, కొడుకులు, కూతుర్ల దగ్గరికి వెళ్లిపోవడం, పెళ్లి చేసుకొని వేరే ప్రాంతాల్లో నివాసం ఉండటం జరుగుతుంది. అటువంటి వారిని షిఫ్టెడ్ ఓటు కింద గుర్తిస్తారు.
ఓటరు జాబితాలో పేరు ఉండి చనిపోయిన వారిని డెత్ ఓటర్లుగా గుర్తిస్తారు. డూప్లికేట్ అంటే ఒక ఓటరు రెండు వార్డుల్లో ఓటు హక్కు కలిగి ఉండటం.. ఇలా ఉన్నప్పుడు ఒక వార్డులో స్లిప్ ఇచ్చి ఇంకో వార్డులో డూప్లికేట్ అని రాస్తారు.
అధికారులు ఓటరు స్లిప్‌లు పంచడానికి వెళ్లినప్పుడు ఓటరు అందుబాటులో లేకపోవడం, లేదా ఇంటికి తాళం వేసి ఉండడం, కుటుంబ యజమాని ఒక్కరే ఉండటం, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి ఉంటే వారిని అబ్సెన్టీ ఓటరు కింద పరిగణిస్తారు.
ఏఎస్‌డీతో బోగస్ ఓట్లకు చెక్


