ముగిసిన మూడో విడత
ఫ చివరి రోజు భారీగా దాఖలైన నామినేషన్లు
ఫ రాత్రి వరకు కొనసాగిన ప్రక్రియ
సాక్షి,యాదాద్రి : మూడవ విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల దాఖలుకు గడువు శుక్రవారం ముగిసింది. చివరి రోజు కావడంత్రో అభ్యర్థులు పోటెత్తారు. సాయంత్రం 5 గంటలకు గడువు ముగియగా.. అప్పటికే వరుసలో వేచి ఉన్న అభ్యర్థులను నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులతో పాటు వారికి మద్దతు ఇచ్చేందుకు వచ్చిన వారిని లైన్‌లో నిలబెట్టి టోకెన్లు ఇచ్చారు. పలు చోట్ల రాత్రి వరకు ప్రక్రియ కొనసాగింది. ఈ విడతలో భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, మోత్కూరు, అడ్డగూడూరు, మోటకొండూరు, గుండాల మండలాల్లో 124 పంచాయతీలు, 1,086 వార్డులకు ఈనెల 17న పోలింగ్ జరగనుంది. అభ్యర్థులు ర్యాలీలతో వచ్చి నామినేషన్ వేశారు.


