పోటెత్తాలి.. మన ఓటు
బొమ్మలరామారం: తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో శుక్రవారం ఓట హక్కుపై స్వయం సహాయక సంఘాల మహిళలు అవగాహన ర్యాలీలు నిర్వహించారు. బొమ్మలరామారం మండల కేంద్రంలో చేపట్టిన ర్యాలీలో ఓటు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు పాల్గొని మాట్లాడారు. ఓటు హక్కు వచ్చిన ప్రతి ఒక్కరూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రలోభా లకు లోనై నోటుకు ఓటును అమ్ముకోవద్దన్నారు. ఒక్క ఓటుతోనే గెలుపోటములు నిర్ణయించబడతాయని, ఏ ఒక్కరూ నిర్లక్ష్యం చేయొద్దన్నారు.


