బోధన చేసి.. భోజనం వడ్డించి
విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్న కలెక్టర్
టెన్త్ విద్యార్థులకు గణితం బోధిస్తున్న కలెక్టర్
భువనగిరి : బీబీనగర్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం కలెక్టర్ హనుమంతరావు తనిఖీ చేశారు. ముందుగా పదో తరగతికి వెళ్లి అప్పటికే ఉపాధ్యాయుడు బోధిస్తున్న పాఠ్యాంశాన్ని పరిశీలించారు. తరువాత విద్యార్థులతో మాట్లాడారు. గణితం సబ్జెక్ట్ బోధించి వారికి పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. సాయంత్రం ప్రత్యేక తరగతులు జరుగుతున్నాయా, లేదా తెలుసుకున్నారు. సులభంగా అర్థమయ్యేలా బోధన చేయాలని, ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. గైర్హాజరైన విద్యార్థులకు ఫోన్ చేసి కారణాలపై వాకబు చేయాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి విద్యార్థులకు స్వయంగా వడ్డించారు.
బోధన చేసి.. భోజనం వడ్డించి


