రాష్ట్రస్థాయిలోనూ మేటిగా నిలుస్తాం
ఆలేరు: రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర కబడ్డీ పోటీలకు యాదాద్రి భువనగిరి జిల్లా జట్టు బయలుదేరి వెళ్లింది. శుక్రవారం క్రీడాకారులతో పాటు జట్టు కోచ్, మేనేజర్ ఆలేరు నుంచి రైలులో బయలుదేరివెళ్లారు. రాష్ట్రస్థాయిలోనూ మేటిగా నిలుస్తామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పూల నాగయ్యతోపాటు రాష్ట్ర,జిల్లా నాయకులు మంద సోమరాజు,పరిగెల రాములు, చింతల సాయిబాబా,పూలచంద్రకుమార్ తదితరులు క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఈనెల 5,6,7 తేదీల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో 51వ జూనియర్ బాలుర కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీలు జరగన్నట్టు నాగయ్య తెలిపారు.


