కట్టుదిట్టంగా ఎన్నికల నియమావళి : కలెక్టర్
భువనగిరిటౌన్ : గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని గురువారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తొలి విడత ఎన్నికల నిర్వహణకు తీసుకుంటన్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలయ్యేలా ప్రత్యేక టీంల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. బరిలో నిలిచిన అభ్యర్థులు, ఏకగ్రీవ స్థానాలు తదితర అంశాలపై ఎన్నికల కమిషనర్‌కు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
చిరస్మరణీయుడు రోశయ్య
భువనగిరిటౌన్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. గురువారం కొణిజేటి రోశయ్య వర్ధంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావుతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. రోశయ్య సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ జయమ్మ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జగన్మోహన్‌ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాగా పేరు మార్పు
గుండాల: ‘జిల్లా మారినా.. పేరు మారలే’ శీర్షికన గురువారం సాక్షి దిన పత్రికలో ప్రచురితమైన కథనానికి అధి కారులు స్పందించారు. మండల పరిషత్ కార్యాలయ భవనంపై జిల్లా పేరు మార్చారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడి తొమ్మిదేళ్లు గడుస్తోంది. అయినా ఎంపీడీఓ కార్యాలయ భవనంపై నేటికీ నల్లగొండ జిల్లా పేరే ఉంది. దీన్ని సాక్షి వెలుగులోకి తేగా అధికారులు నల్ల గొండ పేరు తొలగించి యాదాద్రి భువనగిరి జిల్లా పేరు పెట్టారు.
పాఠశాలల తనిఖీ
గుండాల : మండలంలోని అంబాల ప్రాథమికోన్నత పాఠశాల, వస్తాకొండూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డీఈఓ సత్యనారాయణ గురువారం తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును పరిశీలించారు. విద్యార్థులకు ప్రశ్నలు వేసి వారి సామర్థ్యాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. టెన్త్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని పేర్కొన్నారు.ఆయన వెంట హెచ్ ఎలుగు లింగయ్య, సుమన్, శ్రీనివాస్ ఉన్నారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
భువనగిరి: ఆరోగ్య సంరక్షణకు యోగా కీలకమని బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ అమితా అగర్వాల్ అన్నారు. యోగా శాస్త్రంపై గురువారం బీబీనగర్ ఎయిమ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జీవనశైలిలో చోటు చేసుకుంటున్న మార్పులకోసం యోగా చేయడం తప్పనిసరి అన్నారు. యోగా శాస్త్రాన్ని పాఠ్యాంశంగా చేర్చడం ద్వారా విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సంగీత సంపత్, రిమాదాదా, రాహుల్ మహోత్ర, డాక్టర్ కృష్ణమూర్తి, వెరోనిక్ నికోలాయ్, రోహిణి మోత్వాణి,మీలి పాండా పాల్గొన్నారు.
కట్టుదిట్టంగా ఎన్నికల నియమావళి : కలెక్టర్
కట్టుదిట్టంగా ఎన్నికల నియమావళి : కలెక్టర్


