నిబంధనలకు లోబడి ఖర్చు చేయాలి
భువనగిరిటౌన్ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నిబంధనలకు మించి ఖర్చు చేయకూడదని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులకు ఎన్నికల వ్యయంపై అవగాహన కల్పించారు. 5 వేలకు పైగా జనాభా గల గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థికి రూ.2.50 లక్షలు, వార్డు సభ్యులు రూ.50 వేలకు మించి ఖర్చు చూయకూడదన్నారు. 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.1.50 లక్షలు, వార్డు సభ్యులకు రూ.30వేల వరకు ఖర్చు చేయడానికి పరిమితి ఉందన్నారు. అభ్యర్థులు ప్రచార నిమిత్తం ఉపయోగించే వాహనాలకు రిటర్నింగ్ అధికారుల వద్ద అనుమతి పొందాలని సూచించారు. తొలి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో 6వ తేదీన మొదటి విడత, 8న రెండో విడత.. రెండు దఫాలు అభ్యర్థుల వ్యయాన్ని లెక్కించనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో పాటు ఓడిపోయిన అభ్యర్థులు సైతం ఫలితాలు వెలువడిన రోజు నుంచి 45 రోజుల్లో ఎన్నికల ఖర్చుకు సంబంధించిన తుది వివరాలు సమర్పించాలని సూచించారు. ప్రచార సమయంలో అభ్యర్థుల వద్ద ఆధారాలు లేకుండా వెయ్యి రూపాయలకు మించి నగదు ఉండటానికి వీలు లేదన్నారు.
ఫ జిల్లా వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్


