మూడో విడతకు నేడు ఆఖరు
ఫ రెండో రోజు సర్పంచ్‌కు 147, వార్డులకు 641
సాక్షి,యాదాద్రి : మూడవ విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో రెండో రోజు గురువారం నామినేషన్లు వెల్లువెత్తాయి. సర్పంచ్‌కు 147, వార్డు స్థానాలకు 641 మంది నామినేషన్ వేశారు. రెండు రోజుల్లో కలిపి సర్పంచ్‌కు 281, వార్డులకు 888 నామినేషన్లు పడ్డాయి. ఈ విడతలో భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, మోత్కూరు, అడ్డగూడూరు, మోటకొండూరు, గుండాల మండలాల్లో 124 పంచాయతీలు, 1,086 వార్డులకు డిసెంబర్ 17న పోలింగ్ జరగనుంది. మూడో విడత నామినేషన్ల ఘట్టం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
రెండో రోజు దాఖలైనవి..
మండలం జీపీలు నామినేషన్లు
అడ్డగూడూరు 17 10
చౌటుప్పుల్ 26 36
గుండాల 20 24
మోటకొండూరు 20 28
మోత్కూరు 10 14
నారాయణపురం 31 35
మొత్తం 124 147
వార్డు సభ్యుల స్థానాలకు
మండలం వార్డులు నామినేషన్లు
అడ్డగూడూరు 150 55
చౌటుప్పుల్ 236 187
గుండాల 182 101
మోటకొండూరు 170 103
మోత్కూరు 88 60
నారాయణపురం 260 135
మొత్తం 1,086 641


