నేత్రపర్వంగా తిరునక్షత్ర వేడుకలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్ర ఉత్సవ వేడుకలను గురువారం వైభవంగా జరిపించారు. ఉదయం ఆలయ ముఖ మండపంలో విశేష తిరుమంజన స్నపన ఉత్సవం జరిపించిన అర్చకులు.. అనంతరం ప్రబంధ సేవాకాలం, దివ్య ప్రబంధ పారాయణ వేడుకలు చేపట్టారు. సాయంత్రం తిరుమంగై ఆళ్వార్ పురవీధిసేవ, దివ్య ప్రబంధ సేవాకాలం, రాత్రి నివేదన, తీర్థప్రసాద గోష్టితో ఉత్సవాలకు ముగింపు పలికారు.
సంప్రదాయ పూజలు
ప్రదానాలయంలో సంప్రదాయ పూజలు ఆగమ శాస్త్రం ప్రకారం చేపట్టారు. వేకువజామున సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూలను నిజాభిషేకం, తులసీదళ సహస్రనామార్చన జరిపించారు.ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవా హన సేవ, ఉత్సవమూర్తులకు నిత్య తిరుకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు. సాయంత్రం ఆలయ ముఖమండపంలో స్వామివారి వెండి జోడు సేవలను ఊరేగించారు. వివిధ పూ జల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి రాత్రి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.
నేత్రపర్వంగా తిరునక్షత్ర వేడుకలు


