ప్రజా సేవకులే పాలకులు కావాలి
గుండాల : గ్రామాలలో స్థానిక సంస్థలు జరుగుతున్న నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని రామారం గ్రామానికి చెందిన తెలంగాణ రైతు సంక్షేమ సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఓర్సు ఇంద్రసేన ప్రజా సేవకులే ప్రజా పాలకులు కావాలని కోరుతూ తన ఇంటి ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీపై.. ‘మన స్వతంత్య్ర భారత దేశంలో ఇప్పటి వరకు ప్రజలకు నచ్చిన పాలన జరుగ లేదు. గడిచిన కాలం గడిచింది .. వర్తమానాన్ని సరిదిద్దుకుందాం, అందుకు అనువైన సమయం జరగబోయే స్థానిక ఎన్నికలు, స్థానిక ఎన్నికలలో అధికారం కోసం ఆరాట పడే వ్యక్తులు వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ సభ్యుడి దాక ఎన్నికల సమయంలో అక్కరకు రాని ఖర్చు , ఓటుకు నోటు ఇవ్వడాలు ఆపి ఎన్నికల తరువాత ప్రజల ఆరోగ్యం, విద్య, రైతు కోసం, యువకుల కోసం ఖర్చు చేయాల్సిన విధానం అవలంభించాలి’. అని ఫ్లెక్సీపై పేర్కొన్నారు.


