ఏఐ వీడియోలతో ప్రచారం
యాదగిరిగుట్ట రూరల్ : సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు కొత్త పద్ధతిలో ప్రచారాలు సాగిస్తున్నారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి విన్నూత్నంగా ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్) వీడియోలతో గ్రామంలోని సోషల్ మీడియాలో ప్రచారం సాగిస్తున్నారు. ఈ ఏఐ వీడియోల ద్వారా తమను గెలిపించాలని, గ్రామాభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఏఐ వీడియోలను సర్పంచ్ ఎన్నికల్లో వినియోగించుకోవడం పట్ల గ్రామీణ ప్రజలు సోషల్ మీడియాలో ఆసక్తిగా తిలకిస్తున్నారు.


