ముగిసిన అంతర్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు
హాలియా : నల్లగొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో హాలియా పట్టణంలోని టైం స్కూల్‌లో ఈ నెల 2న ప్రారంభమైన 51వ అంతర్ జిల్లా స్థాయి జూనియర్ బాలికల కబడ్డీ పోటీలు గురువారంతో ముగిశాయి. ఈ పోటీల్లో 33 జిల్లాల జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో రంగారెడ్డి జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలవగా.. నల్లగొండ జట్టు ద్వితీయ స్థానంలో, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు తృతీయ స్థానంలో నిలిచాయి. ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర బాధ్యులు అనిల్, సత్యనారాయణ, చంద్రమౌళిగౌడ్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కారదర్శులు భూలోకరావు, కర్తయ్య, డీఎస్‌పీ శంకర్‌రెడ్డి, సీఐ అర్కపల్లి ఆంజనేయులు, ఎకై ్సజ్ సీఐ ఏడుకొండలు, టైం స్కూల్ డైరెక్టర్ మందా నరేందర్‌రెడ్డి, శ్లోక స్కూల్ గ్రూప్ డైరెక్టర్ కుకుడాల ఆంజనేయులు, జాతీయ కబడ్డీ క్రీడాకారుడు యడవెల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రథమ స్థానంలో రంగారెడ్డి జిల్లా జట్టు
ద్వితీయ స్థానంలో నల్లగొండ జట్టు
ముగిసిన అంతర్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు


