నామినేషన్ రుసుముగా రూపాయి నాణేలు
గరిడేపల్లి: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి బుడిగె పుల్లమ్మ గ్రామస్తుల నుంచి సేకరించిన రూపాయి నాణేలతో రూ.1001 రుసుము చెల్లించి గురువారం నామినేషన్ వేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేద కుటుంబానికి చెందిన తాను పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేయడానికి కొన్ని రోజులుగా స్థానికుల వద్ద రూపాయి నాణేలను సేకరించి భద్రపర్చుకొని నామినేషన్ వేసినట్లు తెలిపారు. గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా తన కుమారుడు రమేష్ గ్రామస్తుల ద్వారా, వాట్సాప్ గ్రూప్‌ల సాయంతో డబ్బులు సేకరించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు.


