అమ్మో.. పోస్టల్‌ బ్యాలెట్‌ ! | - | Sakshi
Sakshi News home page

అమ్మో.. పోస్టల్‌ బ్యాలెట్‌ !

Dec 5 2025 3:28 PM | Updated on Dec 5 2025 3:28 PM

అమ్మో.. పోస్టల్‌ బ్యాలెట్‌ !

అమ్మో.. పోస్టల్‌ బ్యాలెట్‌ !

ఫ ఓటు గోప్యత లేకపోవడంతో జంకుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు

ఆత్మకూర్‌ (ఎస్‌)(సూర్యాపేట) : పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే రిటర్నింగ్‌ అధికారి, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, స్టేజ్‌–2, ప్రిసైడింగ్‌ అధికారి, ఇతర పోలింగ్‌ అధికారులు, బందోబస్తులో పాల్గొనే పోలీసులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ను జారీ చేస్తుంది. దీనిని ఉపయోగించుకుని వారు తమకు నచ్చిన వారికి పెన్నుతో టిక్‌ చేసి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అయితే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసిన తర్వాత అది సంబంధిత గ్రామపంచాయతీ స్టేజ్‌–2 ఆఫీసర్‌కి ఓట్ల లెక్కింపు కంటే ముందు అందజేస్తారు. సదరు పోస్టల్‌ బ్యాలెట్‌ను తెరిచి అభ్యర్థులకు చూపిస్తారు. తనకు ఓటు పడిన అభ్యర్థికి సంతోషంగా ఉన్నా, ఓటు పడని అభ్యర్థులు ఆ ఉద్యోగిపై కక్షగట్టి, గొడవలు పెట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి. దీంతో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి జంకుతున్నారు. ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ రహస్యతకు భంగం వాటిల్లకుండా ఆయా మండల కేంద్రాల్లో ప్రత్యేక పోలింగ్‌ బూత్‌ పెట్టాలని, ఓట్ల లెక్కింపు కంటే ముందే అందరి ఓట్లలో ఇవి కూడా కలపాలని వారు కోరుతున్నారు.

బైండోవర్‌ అంటే ..

తిరుమలగిరి (తుంగతుర్తి) : ఎన్నికల సమయంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. అందులో భాగంగా నేరస్థులు, రౌడీషీటర్లు, అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించే వారిపై నిఘా పెడతారు. అందుకే ఎన్నికలు రాగానే పాత నేరస్థులను బైండోవర్‌ చేస్తుంటారు. పోలీసులు వారిని స్థానిక తహసీల్దార్‌, ఆర్డీఓ ఎదుట హాజరు పర్చి జాగ్రత్తగా మసలుకోవాలని హెచ్చరిస్తారు. ప్రత్యేక బాండ్‌ పేపర్‌పై వారి నుంచి లిఖిత పూర్వక హామీ తీసుకుంటారు. స్వంత పూచీకత్తుపై విడుదల చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement