శ్రీకాంతాచారి త్యాగం మరువలేనిది
భువనగిరి : తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతిని బుధవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భువనగిరిలోని అమరవీరుల స్మారకస్థూపం వద్ద ఏర్పాటు చేసిన శ్రీకాంతాచారి చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పైళ్ల శేఖర్‌రెడ్డి, పలువురు నాయకులు మాట్లాడు తూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన శ్రీకాంతాచారి త్యాగం ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. శ్రీకాంతాచారి త్యాగం వల్ల స్వరాష్ట్ర ఉద్యమం ఉధృతం దాల్చిందన్నారు. ఆయన ఆశయాలను సాకారం చేయాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణవాదిపై ఉందన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పట్టణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్‌కుమార్, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట నర్సింహ్మ, మాజీ కౌన్సిలర్ అజీమోద్దీన్, నాయకులు ఇట్టబోయిన గోపాల్, కర్తాల శ్రీనివాస్ పాల్గొన్నారు.


