హిందూ దేవుళ్లపై సీఎం వ్యాఖ్యలు హేయం
భువనగిరి: హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసనగా బుధవారం భువనగిరిలో బీజేపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు రత్నపురం బలరాం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ మాట్లాడుతూ.. సీఎం చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పోతంశెట్టి రవీందర్, కిసాన్‌మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్‌రెడ్డి, సుర్వి శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్‌మాఽయ దశరథ, నాయకులు కోళ్ల భిక్షపతి, లక్ష్మీనారాయణ, నర్సింహారావు, నల్లమాస వెంకటేశ్వర్లు, రాళ్లబండి కృష్ణాచారి, ఉడుత భాస్కర్, సతీష్, వెంకటేష్, మల్లికార్జున్ పాల్గొన్నారు.


