ఈ జాగ్రత్తలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Nov 16 2025 7:09 AM | Updated on Nov 16 2025 7:09 AM

ఈ జాగ

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఈ జాగ్రత్తలు తప్పనిసరి మందులు వాడకపోతే ప్రమాదం

● 3,53,657 మందికి పరీక్షలు

● బీపీ 62,460. షుగర్‌ 30,599

● మహిళల్లో.. బీపీ 15,344, షుగర్‌ 15,208

షుగర్‌, బీపీ సమస్యల బారిన పడకుండా

ఉండాలంటే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా అవసరమంటున్నారు వైద్యులు.

● ముఖ్యంగా సమతుల పోషకాహారం తీసుకోవాలి. నూనెతో చేసిన ఆహార పదార్థాలు,

● జంక్‌ఫుడ్‌, ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ను వీలైనంత దూరం పెట్టాలి. మద్యం, ధూమపానం చేయకూడదు.

● నిత్యం యోగా, ధ్యానం చేయాలి. నడక, వ్యాయామానికి రోజూ గంట సమయం కేటాయించేలా చూసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా మీ వయస్సు, ఎత్తుకు తగ్గట్టు బరువు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.

● నిత్యం ఆరోగ్యంపై దృష్టి సారించడంతోపాటు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఆలేరు మండలానికి చెందిన ఒక ఉద్యోగి విధి నిర్వహణలో చురుగ్గా ఉండేవారు. కొంతకాలంగా ఆయన తరచూ అనారోగ్యానికి గురవుతుండటంతో తనకు తెలిసిన వైద్యుడిను సంప్రదించారు. పరీక్షలు చేయగా బీపీ అధికంగా ఉన్నట్లు తేలింది. ఉప్పు, కారం తగ్గించుకోవాలని వైద్యుడు సూచించారు. ఈ మాటలను పెడచెవిన పెట్టిన ఉద్యోగి కొద్దిరోజుల తర్వాత మరింత అనారోగ్యానికి గురయ్యాడు. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాడు. వైద్యుల సూచన మేరకు బీపీ నివారణ మందులు రోజూ వాడుతున్నారు.

భువనగిరి మండలంలోని ఓ గ్రామంలో 30 ఏళ్ల యువకుడు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యుడ్ని ఆశ్రయించాడు. ఆ డాక్టర్‌కు అనుమానం వచ్చి షుగర్‌ పరీక్షలు చేయించగా 160 ఎంజీ డీఎల్‌ వచ్చింది. దీంతో మరుసటి రోజు ఉదయం మరోసారి ఖాళీ కడుపుతో పరీక్షలు చేయగా షుగర్‌ వ్యాధి ఉన్నట్లు నిర్థారణ అయింది. ఈ మేరకు మందులు వాడాలని సూచించారు. కాగా.. తమ కుటుంబంలో ఎవరికీ షుగర్‌ వ్యాధి లేదని యువకుడు చెప్పగా.. ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడే దీనికి కారణమని

వైద్యుడు స్పష్టం చేశారు.

సాక్షి యాదాద్రి: బీపీ, షుగర్‌ బాధితులు పెరిగిపోతున్నారు. ప్రతి ఇంట్లో ఒకరిద్దరికి ఈ రెండు వ్యాధులు ఉండడం సర్వసాధారణమై పోయింది. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన నివేదిక ప్రకారం జిల్లాలో 93,059 మంది బీపీ, షుగర్‌ బాధితులు ఉన్నారు అసంక్రమిత వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీ) స్క్రీనింగ్‌లో భాగంగా ప్రతి ఆరు మాసాలకు ఒకసారి టెస్టులు చేస్తారు. జిల్లాలో గతం ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 12 శాతం వరకు బాధితులు పెరిగారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సైతం కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి.

అన్ని ఆరోగ్య కేంద్రాల్లో టెస్ట్‌లు

జిల్లాలో 143 ఆరోగ్య ఉప కేంద్రాలు(ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌) ఉన్నాయి. వీటి పరిధిలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి సర్వే చేస్తారు. 30 ఏళ్ల వయసు పైబడిన వారిలో బీపీ బాధితులు 62,460, మదుమేహం 30,599 మందికి ఉన్నట్లు నిర్ధారణ అయింది. వీరికి ప్రతి నెలా హెల్త్‌ సెబ్‌ సెంటర్లలో పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. నడువలేని వృద్ధులు, దివ్యాంగులకు వారికి ఇళ్లకు వెళ్లి ఆశా కార్యకర్తలు మందులు అందజేస్తున్నారు. బీపీ, షుగర్‌ నియంత్రణలోకి రాని వ్యక్తులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రెఫర్‌ చేస్తున్నారు. అక్కడ కూడా వ్యాధి నియంత్రణలోకి రాకాకపోతే జిల్లా కేంద్రంలోని మెడికల్‌ కళాశాలకు పంపుతున్నారు.

చిన్నారుల్లోనూ టైప్‌–1 డయాబెటిక్‌

చిన్నారుల్లోనూ షుగర్‌(టైప్‌–1 డయాబెటిక్‌) లక్షణాలు బయటపడుతుండటం కలవర పెడుతోంది. అయితే 30 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేస్తుంది. టైప్‌–1 డయాబెటిక్‌ ఖరీదైన వైద్యం కావడంతో పేద కుటుంబాలు చికిత్స చేయించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. చిన్న పిల్లలకు కూడా ఉచితంగా పరీక్షలు చేసి మందులు ఇవ్వాలని కోరుతున్నారు.

కారణాలు ఇవీ..

ప్రస్తుత రోజుల్లో మధుమేహం, అధిక రక్తపోటు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ జబ్బుల బారిన పడుతున్నారు. పట్టణ వాసులే కాదు, పల్లె జనం కూడా వీటి బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధుల పట్ల అవగాహన కలిగి, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే డయాబెటిస్‌, అధిక రక్తపోటు సమస్యలకు దూరంగా ఉంచొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

జిల్లాలోని అన్ని హెల్త్‌ సబ్‌ సెంటర్లలో బీపీ, షుగర్‌ టెస్ట్‌లు జరుగుతున్నాయి. గడిచిన ఆరు నెలల్లో 3 లక్షల మందికి పరీక్షలు నిర్వహించాం. బీపీ,షుగర్‌ బాధితులు డాక్టర్ల సూచన మేరకు క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలి. బీపీ ఉన్నవారు మందులు వాడకుండా నిర్లక్ష్యం చేస్తే బ్రెయిన్‌ స్ట్రోక్‌, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. షుగర్‌ బాధితులకు కంటి చూపు మందగించడం, నరాలు దెబ్బతినడం, మూత్రపిండాల సమస్యలతో పాటు అవయవాలు దెబ్బతింటాయి. రోజూ గంట సేపు వ్యాయామం చేయాలి.

–డాక్టర్‌ సుమన్‌కల్యాణ్‌. జిల్లా ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి

జిల్లాలో 93,059 మంది బీపీ, షుగర్‌ బాధితులు

ఫ ఏటేటా పెరిగిపోతున్న కేసులు

ఫ గత ఏడాది కంటే 12 శాతం అధికం

ఫ వైద్యారోగ్య శాఖ నివేదికలో వెల్లడి

ఫ చిన్నపిల్లల్లోనూ లక్షణాలు

ఫ 30 సంవత్సరాల పైబడిన వారికే ఉచిత పరీక్షలు, మందులు

బీపీ, డయాబెటీస్‌ ఇలా..

జనాభా 8,39,893

పురుషులు 4,24,391

మహిళలు 4,15,502

30 ఏళ్ల వయసు పైబడిన వారు 4,61,778

ఈ జాగ్రత్తలు తప్పనిసరి1
1/5

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఈ జాగ్రత్తలు తప్పనిసరి2
2/5

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఈ జాగ్రత్తలు తప్పనిసరి3
3/5

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఈ జాగ్రత్తలు తప్పనిసరి4
4/5

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఈ జాగ్రత్తలు తప్పనిసరి5
5/5

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement