జలాల్‌పురం చెరువు కట్ట టెండర్ ఖరారు
భూదాన్‌పోచంపల్లి: ప్రమాదకరంగా మారిన భూదాన్‌పోచంపల్లి మండలంలోని జలాల్‌పురం చెరువు కట్ట రక్షణ చర్యలు మొదలుకానున్నాయి. వారంరోజుల క్రితం ఏడోసారి టెండర్లు పిలువగా ఓ కాంట్రాక్టర్ పనులు దక్కించుకొని అగ్రిమెంట్ చేసుకున్నాడు. గత ఏడాది డిసెంబర్ 7న జలాల్‌పురం చెరువు కట్ట మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌కు చెందిన ఐదుగురు యువకులు జలసమాధి అయ్యారు. ఈ ఘటన జరిగిన వారం రోజుల్లోనే మరో కారు చెరువులో పడిపోయింది. గతంలోనూ పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగి ప్రాణ, ఆస్తినష్టం జరిగింది. ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి స్పందించి ఆర్‌అండ్‌బీ శాఖ నుంచి రూ.20 లక్షలు మంజూరు చేయించారు.
జాప్యానికి కారణాలు..
చెరువు కట్ట పనులకు 11 నెలల క్రితమే రూ.20లక్షలు మంజూరయ్యాయి. ఆర్‌అండ్‌బీ అధికారులు ఆరు దఫాలు టెండర్లు పిలువగా కాంట్రాక్టర్లు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఏడోసారి టెండర్లు పిలువగా ఓ కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నాడు.
చేపట్టాల్సిన పనులు ఇవీ..
వాహనాలు చెరువులో పడిపోకుండా ఉండేందుకు చెరువు కట్టకు ఇరువైపులా మెటల్ బారికేడ్లు, మూ లమలుపుల వద్ద మెయిన్‌రోడ్డుపై రంబుల్ స్టిప్స్, రోడ్స్ స్టంట్, కాషన్ బోర్డులు, బ్లింకింగ్ లైట్లు తదితర పనులు చేపట్టాల్సి ఉంది. కాగా ప్రమాదాల నివారణకు రాచకొండ పోలీస్ ఆధ్వర్యంలో తాత్కాలికంగా చర్యలతోనే సరిపెట్టారు.
చెరువుకట్ట వద్ద రక్షణ చర్యల్లో భాగంగా వివిధ పనలు నిర్వహిపలుమార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాకరాకపోవడంతో పనుల్లో జాప్యం జరిగింది. వారం రోజుల క్రితమే టెండర్లు పూర్తయి అగ్రిమెంట్ పూర్తయ్యింది. త్వరగా పనులు చేపట్టాలని కాంట్రాక్టర్‌కు చెప్పాం. త్వరలో పనులు ప్రారంభం అవుతాయి.
–సుగంధర్, ఆర్‌అండ్‌బీ డీఈ, భువనగిరి
ఫ ఏడో సారికి ముందుకొచ్చిన కాంట్రాక్టర్లు
ఫ త్వరలో మొదలుకానున్న పనులు
ఫ 11 నెలల క్రితమే నిధులు మంజూరు


