ఆకట్టుకున్న సైన్స్ ఎగ్జిబిషన్
భువనగిరి: జిల్లా కేంద్రంలోని జీనియస్ పాఠశాలలో శనివారం నిర్వహించిన సైన్స్ ఫెయిర్‌లో విద్యార్థులు వివిధ ఎగ్జిబిట్‌లు ప్రదర్శించారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ నమూనా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్‌రెడ్డి తదితరులు ఎగ్జిబిట్‌లను పరిశీలించారు. విద్యార్థులు వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని, ఉపాధ్యాయులు శాసీ్త్రయ దృక్పథంతో బోధన చేయాలని సూచించారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీయడానికి సైన్స్‌ఫెయిర్‌లు దోహదపడుతాయన్నారు. అంతకుముందు వారు ఎగ్జిబిట్‌లను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సూర్యనారాయణరెడ్డి, చైర్మన్ పడాల శ్రీనివాస్, ప్రిన్సిపాల్ స్వర్ణలత, వైస్ ప్రిన్సిపాల్ దీలిప్‌కుమార్, ఏఓ రవి తదితరులు పాల్గొన్నారు.


