మిషన్ ఎడ్యుకేషన్‌లో నిడమనూరు వాసి
నిడమనూరు: విద్యకు దూరమైన గిరిజన, ఆదివాసీలకు విద్యనందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న మిషన్ ఎడ్యుకేషన్ ఫెడరేషన్‌లో నిడమనూరు మండలం రేగులగడ్డ గ్రామానికి చెందిన రాచూరి రాజేష్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ ఫెడరేషన్ ద్వారా రాజేష్ తన మిత్రులతో కలిసి ఒక బృందంగా ఏర్పడి ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో పర్యటించి వారికి విద్య అవశ్యకతను వివరించి వారి పిల్లలను పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. వీరు చేసిన కృషితో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడులోని గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో 14 పాఠశాలలు పునఃప్రారంభించి ఇప్పటివరకు 3,218 మంది గిరిజనులను పాఠశాలల్లో చేర్పించారు. దీంతో ఇటీవల రాజేష్ బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశం దక్కింది. ఈ సందర్భంగా ప్రధానికి వారు చేపట్టిన పరిశోధనలు, విద్యకు ఆదివాసీలు, గిరిజనులు ఎందుకు దూరమవుతున్నారనే తదితర అంశాలను వివరించారు. దీంతో ప్రధాని మోదీ రాజేష్ బృందాన్ని ప్రశంసించారు.
ఫ గిరిజనులు, ఆదివాసీల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న బృందం
ఫ ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు


