రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు
ఆలేరు : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ హనుమంతరావు నిర్వాహకులను ఆదేశించారు. మంగళవారం ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తడువకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని వారి ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామన్నారు. కాంటా వేసిన ధాన్యాన్ని వెంటనే లారీల్లో లోడ్ చేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆలేరు పట్టణంలోని సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తేమ శాతం సరిగ్గా చూడాడని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. కొలనుపాక వాగుపై ప్రమాదకరంగా ఉన్న లోలెవల్ బ్రిడ్జిని, వరద ప్రవాహాన్ని కలెక్టర్ పరిశీలించారు. వరద ప్రవాహంతో బ్రిడ్జి దెబ్బతి నడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కలెక్టర్ వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్య, తహసీల్దార్ ఆంజనేయులు, ఏఓ శ్రీనివాస్, అధికారులు, రైతులు ఉన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు


