ముగిసిన రోడ్‌ సైక్లింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన రోడ్‌ సైక్లింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు

Nov 3 2025 6:52 AM | Updated on Nov 3 2025 6:52 AM

ముగిస

ముగిసిన రోడ్‌ సైక్లింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు

చౌటుప్పల్‌ : 10వ అంతర్‌ జిల్లా రోడ్‌ సైక్లింగ్‌ చాంపియన్‌షిప్‌–2025 పోటీలు ఆదివారం చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలో ముగిశాయి. అండర్‌–14, అండర్‌–16, అండర్‌–19 విభాగాల్లో రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల క్రీడాకారులు సంయుక్తంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలోని అంబిటస్‌ స్కూల్‌, జేబీ ఇన్‌ఫ్రా గ్రూప్‌ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించాయి. సైక్లింగ్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ఒలంపిక్‌ సంఘం కార్యదర్శి పి. మల్లారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను తిలకించారు. అనంతరం అంబిటస్‌ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబిటస్‌ స్కూల్‌ చైర్మన్‌ కె. జైపాల్‌రెడ్డి, డైరెక్టర్‌ పిసాటి శ్రీకాంత్‌రెడ్డి, జేబీ ఇన్‌ఫ్రా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సురేందర్‌, సైక్లింగ్‌ సంఘం ప్రతినిధులు విజయకాంత్‌, దత్తాత్రేయ, రమేష్‌, పాష, మనోహర్‌కుమార్‌, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన రోడ్‌ సైక్లింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు1
1/1

ముగిసిన రోడ్‌ సైక్లింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement