కారు, ద్విచక్ర వాహనం ఢీ.. ఇద్దరు మృతి
నకిరేకల్: నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామ శివారులో 365వ నంబర్ జాతీయ రహదారిపై ఆది వారం ఉదయం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా కేంద్రంలోని గొర్రెకుంటకు చెందిన పొనుగంటి కిరణ్‌కూమార్ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఎస్‌బీఐ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం కిరణ్‌కుమార్ తన భార్య సంధ్యారాణి(36)తో కలిసి కారులో మిర్యాలగూడ నుంచి వరంగల్‌లోని గొర్రెకుంటకు బయల్దేరాడు. అదేవిధంగా కట్టంగూర్ మండల అయిటిపాముల గ్రామానికి చెందిన వానరాశి మహేందర్(19) ముగ్గు అమ్మేందుకు శాలిగౌరారం మండలం పెర్కకొడారం గ్రామానికి వెళ్లి తిరిగి టీవీఎస్ ఎక్సెల్‌పై స్వగ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో 365వ నంబర్ జాతీయ రహదారిపై నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామ శివారులో కిరణ్‌కుమార్ కారు మహేందర్ వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్తి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కిరణ్‌కూమార్ భార్య సంధ్యారాణి అక్కడికక్కడే మృతిచెందింది. మహేందర్‌కు, కిరణ్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మహేందర్ మృతిచెందాడు. మృతుడు మహేందర్ పెద్దనాన్న కోటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశం తెలిపారు.
ధ్వంసమైన కారు
ఒకరికి తీవ్ర గాయాలు
కారు, ద్విచక్ర వాహనం ఢీ.. ఇద్దరు మృతి
కారు, ద్విచక్ర వాహనం ఢీ.. ఇద్దరు మృతి


