తరగతి గదులు సరిపోను లేవు
మాది ముస్త్యాలపల్లి గ్రామం. మా గ్రామం నుంచి 16 మంది విద్యార్థులం వ్యాన్ కట్టుకుని మోటకొండూర్ పాఠశాలలకు వస్తున్నాం. మా గ్రామంలోని ప్రైమరీ స్కూల్‌లో ఒకే టీచర్ ఉన్నారు. మోటకొండూరులో నలుగురు టీచర్లు ఉన్నారని ఇక్కడకు వస్తున్నాం. ప్రయాణ సౌకర్యం లేక మిగిలిన వారు ఇక్కడికి రావటం లేదు. ప్రయాణ సౌకర్యం కల్పిస్తే అందరం రావటానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా పాఠశాలలో అదనపు తరగతి గదులు నిర్మించాలి.
– సాయివర్షిత్, 5వ తరగతి విద్యార్థి
●


